Mandadam: మందడంలో మహిళలను ఫొటోలు తీస్తున్నాడంటూ వ్యక్తిని రౌండప్ చేసిన రైతులు

  • మందడంలో రైతులు, మహిళల నిరసనలు
  • మహిళల్ని ఫొటో తీసిన వ్యక్తి
  • అడ్డుకున్న రైతులు
  • పోలీసులు సర్దిచెప్పడంతో శాంతించిన రైతులు

అమరావతి ఉద్యమంలో భాగంగా మందడంలో రైతులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ టెంట్ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. మహిళలు మాట్లాడుతుండగా ఓ వ్యక్తి ఫొటోలు తీయడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ వ్యక్తిని చుట్టుముట్టారు. అయితే తాను ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్ నుంచి వచ్చానని ఆ వ్యక్తి చెప్పడంతో ఐడీ కార్డు ఏదని రైతులు నిలదీశారు. ఆ వ్యక్తి ఐడీ కార్డు చూపించకపోవడంతో రైతులు ఆగ్రహం ప్రదర్శించారు. అతడిని అక్కడ్నించి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. చివరికి పోలీసులు రంగప్రవేశం చేసి అతడు ఇంటెలిజెన్స్ విభాగానికి చెందినవాడని చెప్పడంతో రైతులు శాంతించారు.

Mandadam
Andhra Pradesh
Amaravati
AP Capital
Telugudesam
YSRCP
Police
  • Loading...

More Telugu News