Yanamala: పెట్టుబడులకు రాష్ట్ర ప్రతిష్ఠ కీలకం : మాజీ మంత్రి యనమల
- ప్రతిష్ఠ మసక బారితే కష్టం
- పారిశ్రామికవేత్తలు ముఖం చూడరు
- విశాఖకు భవిష్యత్తులోనూ నష్టం
ఏ రాష్ట్రమైనా పారిశ్రామికవేత్తలను ఆకర్షించాలన్నా, పెట్టుబడులు రావాలన్నా ఆ రాష్ట్ర ప్రతిష్ఠ ఎంతో కీలకమని, అదే పోతే రాష్ట్రం ముఖం చూసే పారిశ్రామికవేత్త ఉండరని టీడీపీ నాయకుడు, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. కాకినాడలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెబుతున్న ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, అసలు పెట్టుబడులే రాకుంటే రాష్ట్రాన్ని ఎలా నడిపిస్తారని ప్రశ్నించారు. విశాఖను అభివృద్ధి చేస్తానని సీఎం చెబుతున్నారని, ప్రస్తుత ప్రభుత్వం తీరువల్లే విశాఖకు అన్యాయం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అరకొరగా నిధులు ఇస్తోందని, అప్పులు ఇచ్చేవారు కూడా లేరన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు.