YS Jagan: హైదరాబాద్ కు జగన్... రెండు రోజులు అక్కడే... రేపు కేసీఆర్ తో మీటింగ్!

- లోటస్ పాండ్ లోని నివాసంలో బస
- రేపు కేసీఆర్ తో చర్చలు
- 14న గుడివాడకు వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, రెండు రోజుల పాటు హైదరాబాద్ లో గడపనున్నారు. లోటస్ పాండ్ లోని తన నివాసంలో ఆయన ఉంటారని సీఎంఓ అధికారులు స్పష్టం చేశారు. సోమవారం ఉదయం కేసీఆర్ ను జగన్ కలవనున్నారని, ఆయనతో జరిగే సమావేశంలో ఇరు రాష్ట్రాల మధ్యా అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై చర్చ జరుగుతుందని తెలిపారు. ప్రగతి భవన్ వేదికగా ఇరు రాష్ట్రాల సీఎంల మధ్యా భేటీ జరుగుతుందని వెల్లడించారు. కృష్ణా జలాల పంపకం సహా పలు అంశాలపై భేటీ ఉంటుందని అన్నారు. ఆపై మంగళవారం నాడు గుడివాడలో జగన్ పర్యటన ఖరారైంది. ఇక్కడ జరిగే ఎడ్ల పందాలను ముఖ్యమంత్రి స్వయంగా తిలకించనున్నారు.