Uttar Pradesh: హింసకు మీరే కారణం.. వామపక్ష పార్టీలపై విరుచుకుపడిన యోగి

  • గ్వాలియర్‌లో సీఏఏకు మద్దతుగా సభ
  • వామపక్షాలపై విరుచుకుపడిన యూపీ సీఎం
  • ముగింపు దశలో ఉన్న ఉగ్రవాదం మళ్లీ లేస్తోందని ఆవేదన

దేశంలో హింసాత్మక ఘటనలు జరగడానికి వామపక్ష పార్టీలే కారణమని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జనజాగరణ్ మంచ్ ఆధ్వర్యంలో జరిగిన సభలో యోగి మాట్లాడుతూ.. వామపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు. దేశంలో హింసాత్మక వాతావరణానికి కారణం అవేనని ఆరోపించారు.

ఢిల్లీ జేఎన్‌యూలో పరీక్షలకు అంతరాయం కలిగించేందుకే వారు ఇలాంటి కుట్ర పన్నుతున్నారని అన్నారు. సీఏఏ, జేఎన్‌యూ ఘటన విషయాల్లో ప్రతిపక్షాలు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయని, ఫలితంగా ప్రజలు గందరగోళానికి గురవుతున్నారని అన్నారు. ఇలాంటి చర్యలతో దేశంలో ముగింపు దశలో ఉన్న ఉగ్రవాదం, వేర్పాటువాదం మళ్లీ పురుడుపోసుకుంటున్నాయని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు.

Uttar Pradesh
Yogi Adityanath
CAA
  • Loading...

More Telugu News