Telugudesam: మహిళలను కించపరిచేలా మాట్లాడిన వాసిరెడ్డి పద్మ క్షమాపణలు చెప్పాలి: టీడీపీ నేత అనిత డిమాండ్

  • రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్  విధించాల్సిన అవసరమేంటి?
  • మహిళలను మగ పోలీసులు అరెస్టు చేయడం తగదు
  • మహిళలపై దాడులు చేయమని హోం మంత్రి చెప్పారా?

రాజధాని ప్రాంత రైతులు, మహిళలపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై, వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నాయకురాలు అనిత మండిపడ్డారు. విజయవాడలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్ విధించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు.

శాంతియుతంగా నిరసనకు దిగిన మహిళలను మగ పోలీసులు అరెస్టు చేయడాన్ని ఆమె తప్పుబట్టారు. మహిళలపై దాడులు చేయమని పోలీసులకు హోం మంత్రి చెప్పారా? అంటూ మండిపడ్డారు. రాజధాని ప్రాంత మహిళలను కించపరిచేలా వాసిరెడ్డి పద్మ మాట్లాడటం సబబు కాదని, మహిళలకు ఆమె క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Telugudesam
Anitha
YSRCP
Vasireddy
padma
  • Loading...

More Telugu News