Andhra Pradesh: మనం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామా? ఆఫ్ఘనిస్థాన్ లో ఉన్నామా?: సుజనా చౌదరి

  • మహిళలపై పోలీసులు దాడి చేయడం అన్యాయం?
  • ఒంగోలులో మహిళలపై మగ పోలీసుల దాడి‌ కలచివేసింది
  • వైసీపీ ప్రభుత్వం ఆడపడచుల విశ్వాసం కోల్పోయింది

ఏపీ రాజధాని ప్రాంత మహిళలపై పోలీసులు దాడి చేయడం అన్యాయమని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. రాజధాని కోసం శాంతియుత ఉద్యమాలు చేస్తున్న మహిళలపై దాడి‌ చేసి, అరెస్టు చేయడం తగదని అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో మహిళలపై మగ పోలీసులు దాడి‌ చేయడం కలచి వేసిందని, మనం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామా? ఆఫ్ఘనిస్థాన్ లో ఉన్నామా? అని ప్రశ్నించారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఆడపడుచుల విశ్వాసం కోల్పోయిందని అన్నారు. రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్ విధించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ చేశారు.

మరో ట్వీట్ లో.. శీతాకాలపు విడిది కోసం ఇటీవల హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ని తాను కలిసిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో మర్యాద పూర్వకంగా ఆయన్ని కలిసినప్పుడు, రాజధాని రైతుల సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లిన విషయాన్ని ప్రస్తావించారు.

Andhra Pradesh
Jagan
BJP
Sujana Chowdary
  • Error fetching data: Network response was not ok

More Telugu News