Telangana: తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు చేస్తున్నాం: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

  • 45 లక్షల మందికి పెన్షన్ల కోసం రూ.9,002 కోట్లు 
  • ఇందులో కేంద్రం వాటా రూ.200 కోట్లు మాత్రమే
  • కాంగ్రెస్, బీజేపీలు ప్రజలను మోసం చేస్తున్నాయి

సీఎం కేసీఆర్ నాయకత్వంలో పని చేసేందుకు చాలా మంది టీఆర్ఎస్ లో చేరారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్లు రాని వారు పార్టీ నిర్ణయించిన అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్పారు.

45 లక్షల మందికి పెన్షన్ల కోసం రూ.9,002 కోట్లు ఖర్చు అవుతుందని, దీనిలో కేంద్రం వాటా రూ.200 కోట్లు మాత్రమేనని అన్నారు. త్వరలోనే ‘పల్లె ప్రగతి’ తరహాలోనే ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలపై ఆయన మండిపడ్డారు. ఈ రెండు పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని, పసుపు బోర్డు తెస్తానన్న వాగ్దానంతో ఎంపీగా గెలిచిన ధర్మపురి అరవింద్ తన మాటపై నిలబడలేదని విమర్శించారు.

Telangana
Nizamabad
TRS
Minister
prasanth reddy
BJP
Dharmapuri Aravind
  • Loading...

More Telugu News