Andhra Pradesh: ఏపీ, తెలంగాణలోని జలాశయాలకు నీటి కేటాయింపులపై ఉత్తర్వులు

  • ఏపీకి 84 టీఎంసీలు
  • తెలంగాణకు 140 టీఎంసీలు
  • కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఉత్తర్వులు

ఈ ఏడాది మే 31 వరకు రెండు తెలుగు రాష్ట్రాలకు శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలకు నీటి కేటాయింపులపై కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీకి 84 టీఎంసీలు, తెలంగాణకు 140 టీఎంసీల నీటిని కేటాయిస్తున్నట్టు తమ ఉత్తర్వుల్లో బోర్డు పేర్కొంది.

ఏపీకి కేటాయించిన 84 టీఎంసీలలో.. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడుకు 4 టీఎంసీలు, హంద్రీ నీవా-మచ్చుమర్రి ఎత్తిపోతలకు 18 టీఎంసీలు, నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ద్వారా 20 టీఎంసీలు, కుడి కాల్వ ద్వారా 42 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు అమనుతినిచ్చింది.

తెలంగాణకు కేటాయించిన 140 టీఎంసీలలో.. కల్వకుర్తి ఎత్తిపోతలకు 20 టీఎంసీలు, నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ద్వారా 75 టీఎంసీలు, ఏఎమ్మార్పీ, హైదరాబాద్ జలమండలి, మిషన్ భగీరథ ప్రాజెక్టుకు 45 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు అమనుమతినిచ్చింది.

Andhra Pradesh
Telangana
Nagarjuna sagar
srisailam
Krishna water Board
Allotment
  • Loading...

More Telugu News