Amaravati: రాజధానికి విరాళాల పేరుతో ఎవరిని మోసం చేయాలని చూస్తున్నారు?: మంత్రి మోపిదేవి

  • ప్రతిపక్షాలపై విమర్శలు 
  • ప్రాంతాలు, కులాల వారీగా చిచ్చుపెట్టాలని చూస్తున్నారు
  • చిల్లర రాజకీయాలు చేస్తున్నారు

ఏపీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని, ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం జగన్ పై విమర్శలు చేయడం సబబు కాదని ప్రతిపక్షాలకు మంత్రి మోపిదేవి వెంకటరమణ హితవు పలికారు. ప్రాంతాలు, కులాల వారీగా చిచ్చుపెట్టేందుకు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

అమరావతిలో తాత్కాలిక నిర్మాణాల పేరుతో ప్రజాధనం కొల్లగొట్టారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి కోసం నిన్న మచిలీపట్నంలో అఖిలపక్ష నేతలు విరాళాలు సేకరించడంపై విమర్శలు చేశారు. విరాళాల పేరుతో ఎవరిని మోసం చేయాలని చూస్తున్నారని ప్రశ్నించారు.

Amaravati
capital
Minister
Mopidevi Venkataramana
  • Loading...

More Telugu News