IYR Krishna Rao: రాజధాని మార్చకూడదు అనడం సరికాదు: ఐవైఆర్ కృష్ణారావు
- అన్ని కమిటీలు అధికార వికేంద్రీకరణను ప్రస్తావించాయి
- గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేయాలనే ప్రస్తావన ఉంది
- భవనాలు ఉన్నాయనే పేరుతో రాజధాని మార్చవద్దు అనడం సరికాదు
రాజధాని మార్పుకు అనుకూలంగా ఏపీ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు మరోసారి వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో భవనాలు ఉన్నాయనే కారణంతో రాజధానిని మార్చకూడదు అనడం సరికాదని ఆయన అన్నారు. శివరామకృష్ణన్ కమిటీ, జీఎన్ రావు కమిటీ, బీసీజీ అన్నీ అధికార వికేంద్రీకరణను ప్రస్తావించాయని చెప్పారు. గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో చాలా శాఖల కార్యాలయాలను ఏర్పాటు చేయాలనే సిఫారసు అన్నింట్లో ఉందని తెలిపారు. అమరావతిలో ఉన్న భవనాలు సౌకర్యవంతంగా ఉన్నాయని... వివిధ శాఖల కార్యాలయాల కోసం వాటిని ఉపయోగించుకోవచ్చని సూచించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. దీంతోపాటు ఈనాడు పత్రికలో వచ్చిన 'రాజధాని చుట్టూ శాశ్వత సౌధాలు' అనే కథనాన్ని షేర్ చేశారు.