Nagababu: వైసీపీ ఎమ్మెల్యేలూ... అమరావతి వెళ్లి ఇవే మాటలు చెప్పగలరా?: నాగబాబు సూటి ప్రశ్న

  • రైతుల నిరసనలను తప్పుబడుతున్న ఎమ్మెల్యేలు
  • రాజధాని ప్రాంతానికి వెళ్లి ఇదే చెప్పండి
  • వారు చేసే సన్మానాన్ని చూడాలని ఉందన్న నాగబాబు

ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో రైతులు చేస్తున్న నిరసనలను తప్పు బడుతున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలపై నటుడు నాగబాబు మండిపడ్డారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. కామెంట్ చేసే ఎమ్మెల్యేలు రాజధాని ప్రాంతానికి వెళ్లి మాట్లాడితే, అప్పుడు అక్కడి ప్రజలు చేసే సన్మానాన్ని తాను చూడాలని అనుకుంటున్నానని అన్నారు. "రాజధాని రైతుల మీద తప్పుడు కామెంట్స్ చేసే అధికార పార్టీ ఎమ్.యల్.యేలు మీ రూమ్స్ లో కాకుండా ఒక్కసారి రాజధాని ప్రాంతంలో ఒక మీటింగ్ పెట్టి ఇలాంటి కామెంట్స్ చేస్తే, వాళ్ళు మీకు చేసే సన్మానం కళ్లారా చూడాలని ఉంది" అని ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

Nagababu
Amaravati
YSRCP
Twitter
  • Error fetching data: Network response was not ok

More Telugu News