Hyderabad: ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన.. హైదరాబాదులో పోలీసు వాహనానికి జరిమానా!

  • ఉప్పల్ రింగురోడ్డు సమీపంలో రాంగ్‌రూట్‌లో దూసుకెళ్లిన జీపు
  • ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టిన వ్యక్తి
  • రూ.1135 జరిమానా విధించిన ట్రాఫిక్ పోలీసులు

హైదరాబాద్‌లో ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన ఓ పోలీసు వాహనానికి అధికారులు జరిమానా విధించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన జీపు.. ఉప్పల్ రింగురోడ్డు సమీపంలో రాంగ్ రూట్‌లో దూసుకెళ్లింది. ఓ వ్యక్తి దీనిని ఫొటో తీసి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశాడు. ఈ ఫొటో వైరల్ అయి చివరికి రాచకొండ కమిషనరేట్‌కు చేరింది. స్పందించిన పోలీసులు వాహనానికి రూ.1135 జరిమానా విధించారు. ఇప్పుడు జరిమానా రశీదు కూడా సోషల్ మీడియాకెక్కి చక్కర్లు కొడుతోంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News