Rajahamandry: రేపు రాజమహేంద్రవరంలో పర్యటించనున్న చంద్రబాబునాయుడు
- అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో పర్యటన
- స్థానిక కోటిపల్లి బస్టాండ్ వద్ద రేపు సభ
- ఈ సభకు ప్రజలు తరలిరావాలని చినరాజప్ప విజ్ఞప్తి
రాజధానిని తరలించాలన్న ప్రభుత్వ ఆలోచనను తప్పుబడుతూ అమరావతి రైతులు నిరసనలు, ఆందోళనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. వీరికి మద్దతుగా నిలిచిన అఖిలపక్ష పార్టీలు తమ గళాన్ని వినిపిస్తున్నాయి. ‘సేవ్ అమరావతి.. సేవ్ ఆంధ్రప్రదేశ్’ నినాదంతో ముందు కెళ్తున్నాయి. ఇందులో భాగంగా అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో రేపు రాజమహేంద్రవరంలో నిర్వహించనున్న పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పాల్గొననున్నారు. స్థానిక కోటిపల్లి బస్టాండ్ వద్ద నిర్వహించే సభలో ఆయన ప్రసంగించనున్నారు. ఈ సభకు రాజమహేంద్రవరం వాసులు తరలి రావాలని, తమకు మద్దతు తెలపాలని టీడీపీ నేత నిమ్మకాయల చినరాజప్ప విజ్ఞప్తి చేశారు.