JC Diwakar Reddy: తాత్కాలికం, తాత్కాలికం అంటూ చంద్రబాబు పిచ్చి పని చేశారు: జేసీ దివాకర్ రెడ్డి

  • హైకోర్టుతో రాయలసీమకు ఒరిగేదేమీ లేదు
  • రాజధానిని మార్చడం అంత సులభం కాదు
  • కడపలోనో, పులివెందులలోనో రాజధాని పెట్టుకోండి

రాయలసీమకు హైకోర్టు రావడం వల్ల ఒరిగేది ఏమీ లేదని టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి పెదవి విరిచారు. మహా అయితే ఓ 10 జిరాక్స్ షాపులు వస్తాయని... అంతకు మించి రాయలసీమ ప్రాంతానికి ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు. రాజధానిని మార్చడం వైసీపీ నేతలు చెబుతున్నంత సులభం కాదని చెప్పారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని అన్నారు. ఇప్పుడున్న భవనాలతో రూపాయి ఖర్చు లేకుండా పదేళ్లు నడిపించవచ్చని చెప్పారు.

తాత్కాలికం, తాత్కాలికం అంటూ చంద్రబాబు పిచ్చి పని చేశారని దివాకర్ రెడ్డి అన్నారు. అమరావతిని అత్యున్నత స్థాయిలో నిర్మించాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు అలా చెప్పారని వివరించారు. రాజధానిని ముక్కలు చేస్తే ప్రత్యేక రాయలసీమ ఉద్యమం వస్తుందని హెచ్చరించారు. రాజధానిని కావాలంటే కడపలోనో, పులివెందులలోనో పెట్టుకోమని చెప్పారు. రాయలసీమ ప్రజలకు విశాఖ చాలా దూరమవుతుందని... చాలా ఇబ్బంది పడతారని అన్నారు.

JC Diwakar Reddy
Chandrababu
Amaravati
Telugudesam
  • Loading...

More Telugu News