Australia: విరాళాల సేకరణకు కొత్త పంథా.. అమెరికా మోడల్ ఇన్ స్టాగ్రాం ఖాతా తొలగింపు!
- దాదాపుగా లక్ష డాలర్ల వరకు సేకరణ
- విరాళాలిచ్చినవారికి ఇన్ స్టాగ్రామ్ లో చిత్రాల పోస్ట్
- ఈ వ్యవహారం నచ్చక మోడల్ ఖాతా తొలగింపు
ఆస్ట్రేలియాలో చెలరేగిన కార్చిచ్చుతో ఆ దేశం అపార నష్టాన్ని చవిచూడటంతో ఆర్థిక సాయం కోసం బాధితులు ఎదురు చూస్తున్నారు. వీరిని ఆదుకోవడానికి అమెరికా దేశానికి చెందిన ఓ మోడల్ విరాళాల సేకరణకు తన నగ్న చిత్రాలను అమ్మడానికి పూనుకుంది. 20 ఏళ్ల కైలెన్ వార్డ్ అనే మోడల్ తన నగ్న చిత్రాలను ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టింది.
ఈ మేరకు ఓ ప్రకటనను సామాజిక మాధ్యమంలో పెట్టింది. ‘ఆస్ట్రేలియాలో కార్చిచ్చు బాధితుల కోసం పది డాలర్లు విరాళం ఇస్తే.. వారికి నగ్న చిత్రాలు పంపిస్తాను’ అని పేర్కొంది. ఈ విధంగా ఆమె దాదాపుగా లక్ష డాలర్ల వరకు సేకరించింది. ప్రకటనలో చెప్పిన విధంగానే కైలెన్ తన నగ్న చిత్రాలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అయితే, ఇన్ స్టాగ్రామ్ నిర్వాహకులకు ఈ వ్యవహారం నచ్చకపోవడంతో.. ఆమె ఖాతానే తొలగించారు. దీంతో కైలెన్ నిర్వాహకులపై విమర్శలు చేస్తోంది.