Fishermen: మత్స్యకారుల సంబరాలను చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు: ఎంపీ విజయసాయి రెడ్డి

  • పాక్ జైలు నుంచి వారి విడుదలకు సీఎం జగన్ కృషి చేశారు
  • మత్స్యకారులు సొంతూర్లకు వెళ్లి సంబరాల్లో ఉన్నారు
  • జగన్ కు మంచి పేరు వస్తుందనే చంద్రబాబు విమర్శిస్తున్నారు

14 నెలలపాటు పాకిస్థాన్ చెరలో ఉండి, సీఎం జగన్ చొరవతో ఇటీవల విడుదలైన ఆంధ్రప్రదేశ్ కు చెందిన మత్స్యకారులు సంబరాలు చేసుకుంటున్నారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. అయితే, వారి సంతోషాన్ని చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని ఆయన విమర్శించారు.

‘పాకిస్థాన్ చెరలో 14 నెలల పాటు నరకాన్ని అనుభవించిన మత్స్యకారులు సీఎం జగన్ గారి చొరవతో విడుదలయ్యారు. సొంత ఊళ్లకు చేరి సంబరాలు జరుపుకుంటుంటే చంద్రబాబునాయుడు కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. సీఎం జగన్ కు ఎక్కడ మంచి పేరు వస్తుందో అని దాడులు, అరాచకాలు మొదలు పెట్టారు’ అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

Fishermen
Pak Jail
MP vijayasai reddy
Chandrababu
  • Loading...

More Telugu News