Ali Khomeini: తిరుగుబాబు ఇంకా బతికే ఉంది... అమెరికాను హెచ్చరించిన ఇరాన్!

  • సులేమానీకి నివాళులు అర్పించిన ఖొమైనీ
  • క్షిపణి దాడులు అమెరికాకు చెంపదెబ్బ అంటూ వ్యాఖ్యలు
  • అమెరికా ఉనికి ముగించడమే లక్ష్యమంటూ సమరనాదం

ఇరాన్ అగ్రనేత అలీ ఖొమైనీ అమెరికాకు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు. ఇరాక్ లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులను ప్రస్తావిస్తూ, తిరుగుబాటు ఇంకా బతికే ఉందని ఈ ఘటనలు చెబుతున్నాయని, ఇది అమెరికాకు చెంపదెబ్బ మాత్రమేనని అన్నారు. అయినప్పటికీ ప్రతీకార దాడులు, సైనిక చర్యలతో సులేమానీ తిరిగిరారని తెలుసని, ఈ ప్రాంతంలో అమెరికా ప్రాబల్యాన్ని, ఉనికిని అంతమొందించడమే తమ లక్ష్యమని వ్యాఖ్యానించారు.

పవిత్ర ఖోమ్ నగరంలో ఇరాన్ అగ్రశ్రేణి సైనిక జనరల్ ఖాసిమ్ సులేమానికి నివాళులు అర్పించిన అనంతరం అలీ ఖొమైనీ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇరాన్ క్షిపణి దాడిపై బ్రిటన్ తీవ్రంగా ప్రతిస్పందించింది. ఇరాన్ దాడి జరిపింది సంకీర్ణ దళాల స్థావరంపై అని, అందులో తమ బలగాలు కూడా ఉన్నాయని ఆరోపించింది. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించింది.

Ali Khomeini
Iran
USA
Donald Trump
Khasim Sulemani
  • Loading...

More Telugu News