Tamil Nadu: సర్పంచ్ గా విజయం సాధించిన పారిశుద్ధ్య కార్మికురాలి కొడుకు

  • ఉబ్బితబ్బిబ్బయిపోయిన మాతృమూర్తి 
  • కొడుకు ప్రమాణ స్వీకారానికి యూనిఫాంతోనే హాజరు 
  • తమిళనాడులోని సేలం జిల్లా సన్యాసిపట్టి అగ్రహారంలో ఘటన

పుత్రోత్సాహం అంటే ఏమిటో ఆమెకు అనుభవంలోకి వచ్చింది. తాను పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న పంచాయతీకి కొడుకే సర్పంచ్ గా ఎన్నిక కావడంతో ఆ మాతృమూర్తి ఆనందానికి అవధుల్లేవు. దీంతో కొడుకు ప్రమాణ స్వీకారోత్సవానికి పారిశుద్ధ్య కార్మికురాలి యూనిఫాంతోనే హాజరై తన సంతోషాన్ని ఆమె పంచుకుంది.

తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లాలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇవీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని సన్యాసిపట్టి అగ్రహారం పంచాయతీ సర్పంచ్ గా శేఖర్ (44) 698 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. ఇతని తల్లి సొల్లయ్యమ్మాళ్ (58) గడచిన 25 ఏళ్లుగా పంచాయతీ పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. సర్పంచ్ గా ప్రమాణం చేసిన కొడుకును అభినందిస్తూ ఆమె ఉద్వేగానికి లోనయ్యింది.

  • Loading...

More Telugu News