GDP: 11 ఏళ్ల కనిష్టానికి పడిపోనున్న భారత వృద్ధి రేటు

  • 2008-09లో 3.1 శాతంగా నమోదైన జీడీపీ వృద్ధి రేటు
  • ఈసారి 5 శాతానికి పరిమితం కానున్న జీడీపీ
  • తయారీ రంగం ఢమాల్ మనడమే కారణమని అంచనా

గతంలో ఎన్నడూ లేనంతగా పడిపోతూ వస్తున్న భారత జీడీపీ వృద్ధి రేటు 2019-20 ఆర్థిక సంవత్సరంలో మరింత దిగజారనుందని కేంద్రం అంచనా వేసింది. 2008-09లో దేశ జీడీపీ 3.1 శాతంగా నమోదైంది. ఇప్పటి వరకు ఇదే కనిష్టం కాగా.. 2019-20 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 5 శాతానికి పరిమితం కానుందని కేంద్రం అంచనాకొచ్చింది. అదే జరిగితే గత 11 ఏళ్ల తర్వాత ఇదే కనిష్ట స్థాయి కానుంది. 2018-19లో జీడీపీ వృద్ధి రేటు 6.8 శాతంగా నమోదైంది. అయితే, ఈసారి తయారీ రంగం ఆశించిన స్థాయిలో ఫలితాలు అందుకోలేకపోవడంతో వృద్ధి రేటు గణనీయంగా పడిపోయే అవకాశం ఉందని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) పేర్కొంది.

అలాగే, ఈ 2019-20 ఆర్థిక సంవత్సరంలో వస్తు తయారీ రంగం వృద్ధి రెండు శాతానికి పరిమితం కావొచ్చని కూడా తెలిపింది. కాగా,గతేడాది సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికానికి భారత జీడీపీ వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్ఠ స్థాయి (4.5 శాతం) కి పడిపోయింది. కేంద్రం కనుక తన ఖర్చులను తగ్గించని పక్షంలో ఇది మరింత క్షీణించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News