USA: బ్రేకింగ్... ఇరాక్ లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు!
- సులేమాని మృతిపై రగిలిపోతున్న ఇరాన్
- ఇరాక్ లక్ష్యంగా దాడులు
- ఎయిర్ బేస్ లను తాకిన 12 క్షిపణులు
- పరిస్థితిని సమీక్షిస్తున్న ట్రంప్
తమ మిలిటరీ కమాండర్ సులేమాని మృతికి ప్రతీకారం తీర్చుకోవాలని రగులుతున్న ఇరాన్, తాజాగా, ఇరాన్ లో అమెరికా సైన్యం వాడుకుంటున్న ఎయిర్ బేస్ లపై క్షిపణులను ప్రయోగించింది. అమెరికా దళాలు ఉంటున్న ఇరాక్ విమానాశ్రయాలు లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించినట్టు తెలుస్తుండగా, ప్రాణనష్టంపై సమాచారం వెలువడలేదు.
ఇరాక్ లోని అల్ అసద్, ఇర్బిల్ ఎయిర్ బేస్ లను డజనుకు పైగా క్షిపణులు ఇరాన్ నుంచి వచ్చి తాకినట్టు తెలుస్తోంది. పశ్చిమాసియా నుంచి తన బలగాలను వెనక్కు తీసుకోవాలని అమెరికాను ఇరాన్ హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్ దాడికి తెగబడటంతో, వైట్ హౌస్ అధికారులతో తాజా పరిస్థితులను సమీక్షిస్తున్న ట్రంప్, ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఆందోళన నెలకొంది.