Andhra Pradesh: జగన్ జాతకాల పిచ్చితో ఇటు హిందువులను, అటు క్రైస్తవులను మోసం చేస్తున్నారు: మాజీ మంత్రి జవహర్

  • సీఎం జగన్ పై జవహర్ వ్యాఖ్యలు
  • జగన్ కు జాతకాల పిచ్చి పట్టిందని విమర్శలు
  • రాజధాని మార్పు సలహా స్వరూపానంద ఇచ్చుండొచ్చని సందేహం

టీడీపీ నేత, మాజీ మంత్రి కేఎస్ జవహర్ రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలపై వ్యాఖ్యానించారు. సీఎం జగన్ కు జాతకాల పిచ్చి పట్టిందని, ఆ పిచ్చితో ఇటు హిందువులను, అటు క్రైస్తవులను మోసం చేస్తున్నారని విమర్శించారు.

 జగన్ రాజధానిని విశాఖకు మార్చుతుండడం వెనుక స్వరూపానంద సరస్వతి సలహా ఉండొచ్చని సందేహం వ్యక్తం చేశారు. జగన్ జాతకాల పిచ్చితో ఐదు కోట్ల మంది ప్రజలను కష్టాల్లోకి నెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా, మరికొన్నిరోజుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ తో జగన్ భేటీ అవుతుండడం పట్ల జవహర్ స్పందించారు. హైదరాబాద్ కు మేలు చేసే మరో ఒప్పందం కుదుర్చుకునేందుకే కేసీఆర్ తో సమావేశమవుతున్నారని ఆరోపించారు.

Andhra Pradesh
Jagan
YSRCP
KS Jawahar
Telugudesam
Vizag
Amaravati
KCR
Hyderabad
Swarupananda
  • Loading...

More Telugu News