KS Jawahar: బూతులు మాట్లాడ్డంలో కొడాలిని మించిపోతున్నారు... పిన్నెల్లి నోరు కడుక్కోవడానికి యాసిడ్ పంపిస్తా: మాజీ మంత్రి జవహర్

  • రాజధాని అమరావతిలో రైతుల నిరసనలు
  • పిన్నెల్లిపై దాడి
  • అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు

రాజధాని రైతుల ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వ విప్ పిన్నెల్లిపై దాడి జరగడం, టీడీపీ నేతల అరెస్టు తదితర పరిణామాలపై మాజీ మంత్రి కేఎస్ జవహర్ ఘాటుగా స్పందించారు. రైతులు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే కుట్రపూరితంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడికి వచ్చారని ఆరోపించారు. బూతులు మాట్లాడడంలో పిన్నెల్లి మంత్రి కొడాలి నానిని మించిపోయారంటూ ఎద్దేవా చేశారు. అందుకే పిన్నెల్లి నోరు కడుక్కోవడానికి యాసిడ్ పంపిస్తానని అన్నారు. అధికార పార్టీ నేతలు బూతులు మాట్లాడడం మానేసి బాధ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు. ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలు చేయకుండా మాచర్ల నియోజకవర్గంలో ప్రజలను పీడిస్తున్నారని మండిపడ్డారు.

KS Jawahar
Telugudesam
Andhra Pradesh
Amaravati
YSRCP
Kodali Nani
Pinnelli
  • Loading...

More Telugu News