Nara Lokesh: నారా లోకేశ్ అరెస్ట్.. మరో ముగ్గురు నేతలు కూడా!

  • లోకేశ్ తో పాటు ఎమ్మెల్యే రామానాయుడు అరెస్ట్
  • తోట్లవల్లూరు వైపు తీసుకెళ్తున్న పోలీసులు
  • మండిపడుతున్న టీడీపీ శ్రేణులు

టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే, రాజధాని అమరావతి తరలింపును నిరసిస్తూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు విజయవాడలో 24 గంటల రిలే నిరాహారదీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా దీక్షాస్థలికి లోకేశ్ వెళ్లారు. దీక్షకు సంఘీభావం ప్రకటించిన అనంతరం ఆయన అక్కడి నుంచి బయల్దేరారు. తిరిగి వస్తున్న సమయంలో కనకదుర్గమ్మ వారధి వద్ద లోకేశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

లోకేశ్ తో పాటు అదే వాహనంలో ప్రయాణిస్తున్న టీడీపీ నేత, ఎమ్మెల్యే రామానాయుడును, మరో ఇద్దరు నేతలను కూడా అరెస్ట్ చేశారు. అయితే, వీరిని కలెక్టరేట్ మీదుగా తోట్లవల్లూరు వైపు తీసుకెళ్లారు. మరోవైపు, టీడీపీ శ్రేణులు ఈ అంశంపై మాట్లాడుతూ, పార్టీ ఆఫీసుకు వెళ్తున్నానని లోకేశ్ చెబుతున్నప్పటికీ పోలీసులు వినకుండా అరెస్ట్ చేశారని మండిపడ్డారు.

Nara Lokesh
Nimmala ramanaidu
Telugudesam
Arrest
  • Loading...

More Telugu News