planet hunter satellite TESS: భూమి సైజులో ఉన్న మరో గ్రహాన్ని గుర్తించిన నాసా

  • మరో గ్రహాన్ని గుర్తించిన ప్లానెట్ హంటర్ శాటిలైట్
  • గ్రహానికి 'టీఓఐ 700 డీ'గా నామకరణం
  • 100 కాంతి సంవత్సరాల దూరంలో గ్రహం

మన భూమి పరిమాణంలో ఉన్న మరో గ్రహాన్ని నాసాకు చెందిన ప్లానెట్ హంటర్ శాటిలైట్ 'టెస్' గుర్తించింది. ఈ గ్రహంపై నీరు కూడా ఉండవచ్చని భావిస్తున్నారు. హొనొలూలులో అమెరికన్ ఆస్ట్రోనామికల్ సొసైటీ నిర్వహించిన వార్షిక సమావేశంలో నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లేబొరేటర్ ఈ విషయాన్ని ప్రకటించింది.

ఈ సందర్భంగా నాసా ఆస్ట్రో ఫిజిక్స్ విభాగం డైరెక్టర్ పాల్ హెర్ట్జ్ మాట్లాడుతూ, మన సమీపంలోని ఇతర నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న గ్రహాల్లో... భూమి సైజులో ఉండే గ్రహాలను గుర్తించేందుకు టెస్ శాటిలైట్ ను ప్రయోగించామని తెలిపారు. టెస్ గుర్తించిన గ్రహానికి 'టీఓఐ 700 డీ' అని నామకరణం చేశారు. ఇది భూమికి అత్యంత దగ్గరగా... కేవలం 100 కాంతిసంవత్సరాల దూరంలో ఉందని నాసా తెలిపింది. 2018లో టెస్ ను నాసా ప్రయోగించింది. భూమిని పోలిన గ్రహాన్ని టెస్ గుర్తించడం ఇదే తొలిసారి.

planet hunter satellite TESS
NASA
TOI 700 d
Earth sized world
  • Loading...

More Telugu News