Visakhapatnam District: మద్యం మత్తులో వృద్ధురాలిపై యువకుడి అత్యాచారం.. చెట్టుకు కట్టేసి చావబాదిన జనం

  • విశాఖపట్టణంలోని అనంతగిరి మండలంలో ఘటన
  • వృద్ధురాలు కేకలు వేయడంతో నిందితుడిని పట్టుకున్న గ్రామస్థులు
  • నిందితుడిపై గతంలో చోరీ కేసులు

మద్యం మత్తులో కన్నుమిన్ను కానని ఓ యువకుడు నిద్రిస్తున్న వృద్ధురాలిపై అత్యాచారానికి తెగబడ్డాడు. విశాఖపట్టణం జిల్లా అనంతగిరి మండలంలో జరిగిందీ ఘటన. గ్రామస్థుల కథనం ప్రకారం.. మండలానికి చెందిన దేవభక్తుల రఘు (27) జులాయిగా తిరిగేవాడు. గతంలో పలు చోరీలకు పాల్పడ్డాడు. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఆదివారం రాత్రి పూటుగా తాగిన రఘు.. అర్ధరాత్రి వేళ ఓ ఇంట్లోకి చొరబడి నిద్రిస్తున్న 60 ఏళ్ల వృద్ధురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలు కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు రఘును పట్టుకుని చెట్టుకు కట్టేసి చావబాదారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Visakhapatnam District
Rape
woman
  • Loading...

More Telugu News