Amaravati: నన్నెందుకు హౌస్ అరెస్ట్ చేశారు?: పోలీసులపై గల్లా సీరియస్

  • టీడీపీలో ఉంటే అరెస్టులు చేసేస్తారా?
  • ఇష్టానుసారం వ్యవహరిస్తే ఊరుకోబోం
  • బయటకు వెళ్తా.. ఏం చేస్తారో చేసుకోండి

తనను గృహ నిర్బంధంలోకి తీసుకున్న పోలీసులపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీలో ఉంటే అరెస్టులు చేసేస్తారా? అని విరుచుకుపడ్డారు. పోలీసులు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తాను బయటకు వెళ్తానని, ఏం చేస్తారో చేసుకోవాలని సవాలు విసిరారు.

రాజధాని అమరావతి తరలింపును నిరసిస్తూ గత రెండు వారాలుగా ఆందోళన చేస్తున్న రైతులు నేడు జాతీయ రహదారి దిగ్బంధానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొనకుండా అడ్డుకుంటున్న పోలీసులు వారిని ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు మాజీ మంత్రులు, కీలక నేతలు, కార్యకర్తలను పోలీసులు ఈ ఉదయం గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు.

Amaravati
Galla jayadev
Telugudesam
  • Loading...

More Telugu News