Ramgopal Varma: హృదయం ద్రవించింది... వాళ్లను శిక్షించాల్సిందే: రామ్ గోపాల్ వర్మ

  • పెరిగిన అత్యాచారాలు, వేధింపులు
  • పంజాగుట్ట ఘటనపై స్పందించిన వర్మ
  • ట్విట్టర్ లో ట్వీట్

ఇటీవలి కాలంలో పెరిగిన అత్యాచారాలు, వేధింపులు, అమ్మాయిల ఆత్మహత్యలపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, హైదరాబాద్ నగరంలో జరుగుతున్న ఘటనలపై అసహనాన్ని వ్యక్తం చేశారు. దిశ హత్యాచారాన్ని మరువక ముందే ఇంకో యువతి పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న భయానక సంఘటనను గురించి తెలుసుకుని తన హృదయం ద్రవించిందన్నారు. ఇటువంటి కేసుల్లో నిందితులను కఠినంగా శిక్షించాల్సిందేనని చెప్పారు. ఇందుకోసం ఉన్నతాధికారులు చొరవ తీసుకోవాలని కోరారు.

Ramgopal Varma
Punjagutta
Sucide Attempt
Twitter
  • Loading...

More Telugu News