Tirumala: వెంకన్న దర్శనం కోసం వేచి చూస్తున్న 70 వేల మంది!

  • వైకుంఠ ఏకాదశి నాడు 84 వేల మందికి పైగా దర్శనం
  • ద్వాదశి నాడు వేచి చూస్తున్న 70 వేల మంది
  • 24 గంటల తరువాతే సాధారణ దర్శనం

వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల నాడు, వైకుంఠ ద్వారం నుంచి ఏడుకొండల వెంకన్నను దర్శించుకోవాలని వేచి చూస్తున్న దాదాపు 70 వేల మంది భక్తులు, నిన్నటి నుంచి తిరుమల గిరులపై నిరీక్షిస్తున్నారు. నిన్న ఉదయం క్యూలైన్లలోకి ప్రవేశించిన భక్తులకు ఇప్పటికి కూడా దర్శనం కలుగలేదు. మొన్న రాత్రికే, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లతో పాటు, నారాయణగిరి ఉద్యానవనం నిండిపోగా, ఆపై వచ్చిన వారిని తిరుమాడ వీధుల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లలో కూర్చోబెట్టారు.

నిన్న వీఐపీల దర్శనం తరువాత సామాన్య భక్తులను అనుమతించగా, దాదాపు 84,160 మంది భక్తులు వైకుంఠ ద్వారంలోకి ప్రవేశించారు. మరో 70 వేల మంది భక్తులు ఇంకా దర్శనం కోసం వేచి చూస్తున్న పరిస్థితి. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ. 3 కోట్లు వచ్చిందని, ఇకపై ఉచిత దర్శనానికి వచ్చే భక్తులకు 24 గంటల తరువాత మాత్రమే దర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News