Ala Vaikunthapuramulo: మీ వాడ్ని కుదురుగా నిలబడమనండి పాట రాస్తాను అని చెప్పా: బన్నీ గురించి చెప్పిన 'సిరివెన్నెల'
![](https://imgd.ap7am.com/thumbnail/tn-cc17618507f8.jpg)
- హైదరాబాదులో అల... వైకుంఠపురములో ప్రీరిలీజ్ ఈవెంట్
- ఉద్వేగంతో ప్రసంగించిన సిరివెన్నెల
- బన్నీపై ప్రశంసలు
'అల... వైకుంఠపురములో' ప్రీరిలీజ్ ఈవెంట్ లో దిగ్గజ సినీ గేయ రచయిత 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ముఖ్యంగా హీరో అల్లు అర్జున్ గురించి చెబుతూ, బన్నీ అంటేనే తనకు వివశత్వం వస్తుందని, ఒళ్లు మర్చిపోతానని అన్నారు.
"ఓసారి అల్లు అరవింద్ తో చెప్పాను... మీ వాడ్ని కుదురుగా ఓ చోట నిలబడమని చెప్పండి పాట రాస్తాను అన్నాను. ఎందుకంటే బన్నీ ఓ కదిలే విద్యుత్ తీగ. అతడలా మెరుపులా నర్తిస్తూ ఉంటే నేను కళ్లుచెదిరేలా చూస్తుంటాను తప్ప ఏం పాట రాయగలను? అని చెప్పాను. బన్నీ సినిమాలు టీవీలో చూస్తుంటాను. అతడిలో ఉన్న సంస్కారం నాకిష్టం. నా బావ అల్లు అరవింద్ పిల్లలందరూ ఎంతో వినయశీలులు. వారి ప్రవర్తన చాలా బాగుంటుంది" అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాదు, తనతో పాటు ఈ సినిమాలో పాటలు రాసిన ఇతర గీతరచయితలను ఎంతో సహృదయతతో పేరుపేరునా అభినందించారు.