Telangana: టీ- మున్సిపల్ ఎన్నికలపై ఉత్తమ్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ

  • ఎన్నికల నియమావళిని న్యాయస్థానానికి సమర్పించాలి
  • రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు
  • రేపు సాయంత్రం వరకు నోటిఫికేషన్ విడుదల చేయొద్దు

తెలంగాణలో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళలకు రిజర్వేషన్లు ఖరారు చేయకుండానే నోటిఫికేషన్ విడుదల చేయాలనుకోవడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఈరోజు విచారణ జరిగింది. నిబంధనలు పాటించకుండానే రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయాలని చూస్తోందని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఎన్నికల నియమావళిని న్యాయస్థానానికి సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. రేపు సాయంత్రం వరకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయొద్దని ఆదేశించింది. ఈ కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది. కాగా, ఎన్నికల కమిషన్ ప్రకారం రేపు నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది.

Telangana
Muncipal Elections
Notification
High Court
T-congress
Pcc
Uttam Kumar Reddy
  • Loading...

More Telugu News