Sathya Prakash: అమ్మానాన్నలు బ్రెడ్ తింటున్నారే అనుకున్నాను .. అది పేదరికమని తెలియదు: సినీ నటుడు సత్యప్రకాశ్

  • మాది దిగువ మధ్యతరగతి ఫ్యామిలీ 
  • రెండు గదుల్లో 11మందిమి ఉండేవాళ్లం 
  •  భగవంతుడి అనుగ్రహంతో ఈ స్థాయికి వచ్చానన్న సత్యప్రకాశ్

తెలుగులో ప్రతినాయకుడిగా సత్యప్రకాశ్ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. విభిన్నమైన డైలాగ్ డెలివరీ .. విలక్షణమైన నటన ఆయన సొంతం. అలాంటి సత్య ప్రకాశ్ తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .."నేను దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను. మాది ఉమ్మడి కుటుంబం .. రెండే గదులు .. వాటిలో పదకొండుమందిమి ఉండేవాళ్లం.

మా నాన్న ఒక్కరు మాత్రమే సంపాదిస్తూ ఉండేవారు. జీతం సరిపోకపోవడం వలన నాన్న అప్పులు చేస్తుండేవారు. అప్పుడప్పుడు అమ్మానాన్నలు అన్నం మాకు పెట్టేసి వాళ్లు బ్రేడ్ తినేవారు. మాకు బ్రెడ్ పెట్టడం లేదని అనుకునే వాళ్లమేగానీ, అది పేదరికమని తెలియని వయసు మాది. మా నాన్న సైకిల్ పై తిరుగుతుండటం చూసి ఎప్పటికైనా స్కూటర్ కొనగలమా అని అనుకునేవాడిని. అలాంటిది నేను కారు కొనే స్థాయికి వచ్చాను. దీనంతటికి భగవంతుడి అనుగ్రహం కారణమని నేను బలంగా భావిస్తాను" అని చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News