Britain: బ్రిటన్ లోని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో కూడా జేఎన్ యూ ప్రకంపనలు!

  • జేఎన్ యూలో ఆగని ఆందోళనలు
  • గత రాత్రి విద్యార్థులు, ప్రొఫెసర్లపై దుండగుల దాడి
  • ఖండించిన విదేశీ యూనివర్సిటీల విద్యార్థులు

ఢిల్లీలోని జేఎన్ యూ గత కొన్నివారాలుగా అట్టుడుకుతోంది. గతరాత్రి వర్సిటీ క్యాంపస్ లో విద్యార్థులు, ప్రొఫెసర్లపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో మరింతగా భగ్గుమంటోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ జేఎన్ యూ విద్యార్థులకు హైదరాబాద్, అలీఘడ్, కోల్ కతా, పుదుచ్చేరి యూనివర్సిటీల విద్యార్థులు సంఘీభావం ప్రకటించారు. అంతేకాదు ఆందోళనలు చేపడుతూ తమ నిరసన తెలుపుతున్నారు.

అయితే, ఎక్కడో బ్రిటన్ లో ఉన్న ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో సైతం జేఎన్ యూ ప్రకంపనలు వినిపించడం ఆశ్చర్యమే. అక్కడి విద్యార్థులు సైతం ప్లకార్డులతో జేఎన్ యూ విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు. కొలంబియా విశ్వవిద్యాలయంలోనూ విద్యార్థులు నిరసన ప్రదర్శన చేపట్టారు. వర్సిటీ క్యాంపస్ లలో ఉండే విద్యార్థులకు సరైన రక్షణ కల్పించాలని కోరారు.

Britain
Oxford University
JNU
New Delhi
Columbia University
UK
  • Loading...

More Telugu News