Congress: మోదీ అండతో మూకలు రెచ్చిపోతున్నాయి: జేఎన్ యూ ఘటనపై సోనియా గాంధీ

  • విద్యార్థుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు
  • వారి హక్కుల నుంచి దూరం చేస్తోంది
  • భవిష్యత్తుపై ఆశావహంగా ఉండి, ఉపాధి కల్పించే విద్య అవసరం

ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో నిన్న రాత్రి విద్యార్థులు, అధ్యాపకులపై దుండగులు జరిపిన దాడిపై   కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పందించారు. దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. సోనియా ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.. మోదీ అండతో మూకలు రెచ్చిపోతున్నాయని పేర్కొన్నారు. విద్యార్థుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థులు, యువతకు తమ సంఘీభావాన్ని ప్రకటిస్తున్నట్లు తెలిపారు.

‘విద్యార్థులు, యువతకు ప్రయోజనకరమైన విద్య అవసరముంది. భవిష్యత్తుపై అశావహంగా ఉండి, ఉపాధి, ఉద్యోగాలు లభించే విద్య అవసరం. అంతేకాక, ప్రజాస్వామ్యంలో ప్రత్యక్షంగా పాల్గొనేందుకు అవకాశముండాలి. కానీ, మోదీ ప్రభుత్వం వారిని హక్కులనుంచి దూరం చేయాలని చూస్తోంది’ అని అన్నారు. ప్రతిరోజు దేశంలోని క్యాంపస్, కాలేజీల్లో పోలీసులు లేదా ఇతర అసాంఘిక స్వార్థ శక్తులు దాడులకు దిగుతున్నాయని సోనియా ధ్వజమెత్తారు.

Congress
Sonia Gandhi
codemn
JNU
Attack
students
Delhi
  • Loading...

More Telugu News