NTR: ఎన్టీఆర్ పై చంద్రబాబు చెప్పులు వేయించినప్పుడు భువనేశ్వరి ఎందుకు బయటికి రాలేదు?: రోజా

  • నారా భువనేశ్వరిపై రోజా ఫైర్
  • చంద్రబాబు చేతిలో రాజకీయ పావుగా మారారంటూ విమర్శలు
  • రెండు గాజులు ఇస్తే ఎవరూ నమ్మరని వ్యాఖ్యలు

టీడీపీ అధినేత చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా నిప్పులు చెరిగారు. చంద్రబాబు చేతిలో భువనేశ్వరి రాజకీయ పావుగా మారారని ఆరోపించారు. ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచినప్పుడు భువనేశ్వరి ఎక్కడికెళ్లారని ప్రశ్నించారు. నాడు తన తండ్రిపై భర్తే చెప్పులు వేయిస్తుంటే భువనేశ్వరి ఎందుకు బయటికి రాలేదని నిలదీశారు. పదవిని కోల్పోయి అసెంబ్లీ నుంచి కంటతడి పెట్టుకుంటూ ఎన్టీఆర్ వెళుతుంటే భువనేశ్వరి ఎందుకు తండ్రిని పరామర్శించలేదని అడిగారు.

తోడబుట్టిన పురందేశ్వరి, హరికృష్ణలను పార్టీ నుంచి గెంటేసినంత పనిచేసినా భువనేశ్వరి ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. రాజధాని నిర్మాణం కోసం గతంలో స్కూలు పిల్లలు హుండీలు ఏర్పాటు చేస్తే భువనేశ్వరి కానీ, ఆమె కోడలు కానీ ఒక్క రూపాయి కూడా విరాళం ఇవ్వలేదని రోజా వ్యాఖ్యానించారు. ఇప్పుడు రాజధాని రైతుల కోసం అంటూ రెండు గాజలు ఇస్తే ఎలా నమ్మాలని రైతులు అడుగుతున్నారని రోజా తెలిపారు.

NTR
Chandrababu
Nara Bhuvaneswari
Roja
Telugudesam
YSRCP
Andhra Pradesh
Amaravati
  • Loading...

More Telugu News