Chammak Chandra: రష్మీని ఎక్కువగా ఆటపట్టించేవాడిని: చమ్మక్ చంద్ర

  • 'జబర్దస్త్' లేకపోతే నేను లేను
  • రష్మీ పాజిటివ్ గా తీసుకుంటుంది 
  • అనసూయ నవ్వుతూ పలకరిస్తుందన్న చమ్మక్ చంద్ర

'జబర్దస్త్' కామెడీ షోకి ఎంతోమంది అభిమానులు వున్నారు. ఈ కామెడీ షోకి అనసూయ - రష్మీ ఇద్దరూ వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తూ వుంటారు. ఈ ఇద్దరి గ్లామర్ ఈ షోకి ప్రత్యేక ఆకర్షణ అని చెప్పుకుంటూ వుంటారు. ఈ వేదికపై కామెడీని పండించిన చమ్మక్ చంద్ర తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రష్మీ - అనసూయలను గురించి ప్రస్తావించాడు.

"చమ్మక్ చంద్రగా నేను గుర్తింపు పొందడానికీ .. ఈ రోజున నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం 'జబర్దస్త్' కార్యక్రమమే. నేను ఎక్స్ ట్రా జబర్దస్త్ చేసేవాడిని కనుక, రష్మితో సాన్నిహిత్యం ఎక్కువ. స్కిట్లో భాగంగా నేను రష్మిని ఎక్కువగా ఆటపట్టించేవాడిని. ఆమె ఎప్పుడూ ఫీల్ కాకుండా .. చాలా పాజిటివ్ గా తీసుకునేది. ఇక అనసూయగారు కూడా నవ్వుతూ పలకరిస్తారు .. మంచిగా మాట్లాడతారు" అని చెప్పుకొచ్చాడు.

Chammak Chandra
Anasuya
Rashmi
  • Loading...

More Telugu News