Kapil Dev: ఏప్రిల్ 10న వస్తున్న కపిల్ దేవ్ బయోపిక్

  • కపిల్ జీవితకథ ఆధారంగా '83' చిత్రం
  • నేడు కపిల్ దేవ్ జన్మదినం
  • శుభాకాంక్షలు తెలియజేసిన '83' చిత్ర యూనిట్

భారత క్రికెట్ చరిత్రలో ఆణిముత్యం వంటి క్రికెటర్ కపిల్ దేవ్. స్పిన్నర్లే రాజ్యమేలుతున్న భారత్ క్రికెట్ యవనికపై పదునైన పేస్ తో మెరిసిన సిసలైన ఆల్ రౌండర్. అందరూ అనామక జట్టుగా భావించిన భారత జట్టును 1983లో వరల్డ్ కప్ విజేతగా నిలిపిన ఘనత కపిల్ దేవ్ సొంతం. తాజాగా బాలీవుడ్ లో కపిల్ దేవ్ జీవితం ఆధారంగా '83' పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో కపిల్ దేవ్ పాత్రను రణవీర్ సింగ్ పోషిస్తున్నాడు.

ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. నేడు కపిల్ దేవ్ జన్మదినం కావడంతో '83' చిత్రబృందం ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసింది. కబీర్ సింగ్ తెరకెక్కిస్తున్న ఈ బయోపిక్ లో తమిళనటుడు జీవా కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రధానంగా కపిల్ నాయకత్వంలో భారత్ కప్ విజేతగా ఎలా ఎదిగిందన్న విషయాన్ని చూపించనున్నారు.

Kapil Dev
India
Cricket
83
Bollywood
Ranveer Singh
  • Loading...

More Telugu News