Kishan Reddy: కిషన్‌రెడ్డికి ఘన స్వాగతం పలికిన దివాకర్ రెడ్డి

  • అనంతపురంకు విచ్చేసిన కిషన్ రెడ్డి
  • హెలిప్యాడ్ వద్ద ఘన స్వాగతం
  • కిషన్ రెడ్డితో కాసేపట్లో భేటీ అయ్యే అవకాశం

కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి కాసేపటి క్రితం అనంతపురానికి విచ్చేశారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా నగరానికి విచ్చేసిన కేంద్రమంత్రికి టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. హెలిప్యాడ్ వద్ద జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, ఎస్పీ సత్యఏసుబాబు, అనంతపురం ఎంపీ తలారి రంగయ్య తదితరులు పుష్పగుచ్ఛాలిచ్చి స్వాగతం పలికారు. కాసేపటి తర్వాత కిషన్ రెడ్డితో దివాకర్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం.

మరోవైపు, దివాకర్ రెడ్డి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అనంతపురానికి వచ్చిన బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ను కలిసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, జాతీయ పార్టీలతో అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. పీవోకేను భారత్ లో కలిపేస్తే... తాను బీజేపీలో చేరుతానని, అంతవరకు టీడీపీలోనే ఉంటానని అన్నారు.

Kishan Reddy
Diwakar Reddy
Telugudesam
BJP
  • Loading...

More Telugu News