Rajani: 'దర్బార్' నుంచి లిరికల్ వీడియో సాంగ్

  • పోలీస్ ఆఫీసర్ గా రజనీకాంత్ 
  • ముఖ్యమైన పాత్రలో నివేద థామస్ 
  • సంగీత దర్శకుడిగా అనిరుధ్  

రజనీకాంత్ - మురుగదాస్ కాంబినేషన్లో రూపొందిన 'దర్బార్' సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. రజనీ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి తాజాగా ఒక లిరికల్ వీడియో సాంగ్ ను వదిలారు.

'తలైవా ఇన్ ఛార్జ్ .. 'అంటూ ఈ పాట సాగుతోంది. అనిరుధ్ బాణీలో భాస్కర భట్ల తెలుగు పదాలను అమర్చాడు. రజనీ క్రేజ్ ను .. మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని ఈ పాటను కంపోజ్ చేశారు. మిగతా వాళ్లకి మాత్రం ఈ పాట కాస్త గందరగోళంగానే అనిపిస్తుంది. ఈ సినిమాలో రజనీ సరసన నాయికగా నయనతార కనిపించనుంది. ఓ ముఖ్యమైన పాత్రను నివేదా థామస్ పోషించింది. సంక్రాంతికి వస్తున్న ఈ సినిమా, వసూళ్ల పరంగా కొత్త రికార్డులను సృష్టిస్తుందని రజనీ అభిమానులు భావిస్తున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News