cat: ఏకాగ్రతతో ప్రార్థనలు చేస్తోన్న బౌద్ధ సన్యాసిని డిస్టర్బ్ చేసిన పిల్లి.. వీడియో వైరల్

  • థాయిలాండ్‌లో ఘటన
  • బౌద్ధులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తోన్న సమయంలో వచ్చిన పిల్లి
  • కోపం తెచ్చుకోని బౌద్ధ సన్యాసి

ప్రార్థనలు చేస్తున్న ఓ బౌద్ధ సన్యాసి సహనాన్ని పరీక్షించింది ఓ పిల్లి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇటీవల థాయిలాండ్‌లోని వాట్‌ ఉడోమ్రాంగ్సీలో బౌద్ధులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వేదికపై కూర్చొని పూర్తి ఏకాగ్రతతో ప్రార్థనలు చేస్తోన్న ఓ బౌద్ధ సన్యాసి కాళ్లపైకి ఎక్కిన ఓ పిల్లి ఆయనను డిస్టర్బ్‌ చేసింది. పిల్లిని ఆయన చేతితో పక్కకు పంపే ప్రయత్నాలు చేసినప్పటికీ అది వెళ్లలేదు.

దీనిపై ఆయన స్పందిస్తూ తాను పుస్తకం చదివేందుకు ప్రయత్నిస్తుంటే, అదే సమయంలో వచ్చిన పిల్లి తన దృష్టిని తన వైపునకు తిప్పుకుందని అన్నారు. థాయ్‌లాండ్‌ బౌద్ధాలయాల్లో పిల్లులను స్వేచ్ఛగా తిరగనిస్తారు. ఉడోమ్రాంగ్సీ బౌద్ధాలయంలో  12 పిల్లులున్నాయి. ఇక్కడకు వచ్చే బౌద్ధ మతస్తులు పిల్లులకి ఆహారం తినిపిస్తారు.

  • Loading...

More Telugu News