Anantapur District: అనంతపురం జిల్లాలో గ్రామ సచివాలయం ఉద్యోగిని ఆత్మహత్య

  • 22 ఏళ్ల నందిని ఆత్మహత్య
  • కనేకల్ పంచాయతీ 4వ వార్డు కార్యదర్శిగా పని చేస్తున్న నందిని
  • ఇంకా తెలియరాని కారణాలు

అనంతపురం జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. గ్రామ సచివాలయ కార్యదర్శిగా పని చేస్తున్న నందిని (22) అనే యువతి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కనేకల్ పంచాయతీ 4వ వార్డు కార్యదర్శిగా ఆమె విధులను నిర్వహిస్తున్నారు. అయితే, ఆమె ఆత్మహత్యకు గత కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి, పరిసరాలను పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తును ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Anantapur District
Kanekal
Ward Secretary
Suicide
  • Loading...

More Telugu News