Ganta Srinivasa Rao: రాజధాని విషయంలో తన వైఖరిని కుండబద్దలుగొట్టిన గంటా శ్రీనివాసరావు

  • అధిష్ఠానం నుంచి మాకు మినహాయింపు ఉంది
  • ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖను స్వాగతిస్తాం
  • అమరావతి రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే

ఏపీకి మూడు రాజధానుల ప్రకటనపై టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మరోమారు తన వైఖరిని కుండబద్దలుగొట్టారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా సింహాచలం లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గంటా.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖను స్వాగతించకుండా ఉండలేమని స్పష్టం చేశారు. నగరం ఇప్పటికే ఆర్థిక రాజధానిగా ఎదిగిందని అన్నారు. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ రాజధాని అయితే మరిన్ని వనరులు లభిస్తాయన్నారు. అయితే, అమరావతి నుంచి రాజధానిని తరలించిన తర్వాత అక్కడి రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వానిదేనని గంటా పేర్కొన్నారు.

విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా చేయడాన్ని సమర్థిస్తూ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నాయకులందరం కలిసి ఏకగ్రీవ తీర్మానం చేసినట్టు చెప్పారు. అనంతరం దానిని పార్టీ అధినేత చంద్రబాబునాయుడికి పంపినట్టు చెప్పారు. ఈ విషయాన్ని హైకమాండ్ అర్థం చేసుకుని తమకు మినహాయింపు ఇచ్చిందని గంటా పేర్కొన్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News