Hyderabad: అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టిన పోలీసు కారు!

  • హైదరాబాద్, గచ్చిబౌలిలో ఘటన
  • ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలు
  • అతివేగమే కారణమని నిర్ధారణ

పెట్రోలింగ్ నిమిత్తం వెళుతున్న పోలీసు కారు, అదుపుతప్పి, డివైడర్ ను ఢీకొంది. ఈ ఘటన హైదరాబాద్, గచ్చిబౌలిలో జరిగింది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో వాహనంలోని ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న గచ్చిబౌలి పోలీసులు, క్రేన్ సాయంతో వాహనాన్ని డివైడర్ నుంచి తొలగించి, తీసుకెళ్లారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నామని తెలిపారు.

Hyderabad
Police
Car
Road Accident
  • Loading...

More Telugu News