Nitin Gadkari: అదో అపవిత్ర కూటమి.. కూలిపోవడం ఖాయం: గడ్కరీ

  • బాల్‌థాకరేకు పూర్తి వ్యతిరేకంగా ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం
  • కూటమి పార్టీల మధ్య సైద్ధాంతిక సారూప్యం లేదు
  • కార్యకర్తల ఆగ్రహానికి శివసేన గురికావడం ఖాయం

మహారాష్ట్రలోని శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ప్రభుత్వంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అదో అపవిత్ర కూటమని, కూలిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. కూటమిగా ఏర్పడిన పార్టీల మధ్య సైద్ధాంతిక సారూప్యతలు లేవని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులను వెళ్లగొట్టాలంటూ అప్పట్లో శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే అన్నారని పేర్కొన్న మంత్రి.. ఇప్పుడు మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం సీఏఏను వ్యతిరేకిస్తోందని దుమ్మెత్తి పోశారు. సీఏఏకి మద్దతుగా బీజేపీ నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మరాఠా, హిందుత్వ అస్థిత్వాన్ని వీడితే శివసేన తమ కార్యకర్తల ఆగ్రహానికి గురికాక తప్పదని గడ్కరీ హెచ్చరించారు.

Nitin Gadkari
Shiv sena
CAA
  • Loading...

More Telugu News