Rashi Khanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • లండన్ లో రాశిఖన్నా హాలిడే 
  • చిరంజీవి సినిమా అప్ డేట్స్ 
  • రాజమౌళి సినిమాలో యంగ్ కమెడియన్

*  ఇటీవల 'వెంకీమామ' సినిమాతో హిట్ కొట్టిన అందాలతార రాశిఖన్నా ప్రస్తుతం వెకేషన్ కోసం లండన్ లో వుంది. తన కుటుంబ సభ్యులతోను, మిత్రులతోనూ కలసి అందాల లండన్ నగరంలో హాలిడేను ఎంజాయ్ చేస్తున్నట్టు రాశి పేర్కొంది. విజయ్ దేవరకొండతో కలసి రాశి నటించిన 'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రం వచ్చే నెలలో రిలీజ్ కానుంది.
*  కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ ఇటీవల ప్రారంభమైన సంగతి విదితమే. ప్రస్తుతం హైదరాబాదులో సినిమాలోని కొన్ని ఎమోషనల్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు. ఇది చిరంజీవి నటిస్తున్న 152వ సినిమా!
*  'అర్జున్ రెడ్డి' సినిమాతో మంచి కమెడియన్ గా పేరుతెచ్చుకున్న రాహుల్ రామకృష్ణ తాజాగా రాజమౌళి సినిమాలో ఛాన్స్ అందుకున్నాడు. రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో ఓ కీలక పాత్రలో రాహుల్ నటిస్తున్నాడట.

Rashi Khanna
Chiranjeevi
Koratala Shiva
Rajamouli
Rahul Ramakrishna
  • Loading...

More Telugu News