Wagha: వాఘా సరిహద్దుకు వెళ్లిన ఏపీ మంత్రి మోపిదేవి

  • పాక్ చెర నుంచి ఏపీ మత్స్యకారులు విడుదల
  • వాఘా బోర్డర్ వద్ద భారత్ కు అప్పగించనున్న పాక్
  • మోపిదేవిని వాఘా వెళ్లాలని ఆదేశించిన సీఎం జగన్

పాకిస్థాన్ చెరలో మగ్గిన ఏపీ మత్స్యకారులను స్వస్థలానికి తీసుకువచ్చేందుకు మంత్రి మోపిదేవి వెంకటరమణ భారత్, పాక్ సరిహద్దు ప్రాంతం వాఘా వెళ్లారు. తెలుగు మత్స్యకారులను పాకిస్థాన్ విడిచిపెట్టడంతో వారిని తీసుకురావాలని మోపిదేవిని సీఎం జగన్ ఆదేశించారు. సీఎం ఆదేశాలతో వాఘా బోర్డర్ పయనమైన మోపిదేవి కొద్దిసేపటి క్రితమే అక్కడికి చేరుకున్నారు. లాంఛనాలు పూర్తయ్యాక పాక్ అధికారులు ఏపీ మత్స్యకారులను భారత అధికారులకు అప్పగించనున్నారు. కొంతకాలంగా వైసీపీ ఎంపీలు అవిశ్రాంతంగా ప్రయత్నాలు చేయడంతో పాక్ చెర నుంచి మత్స్యకారుల విడుదలకు మార్గం సుగమమైంది.

Wagha
Andhra Pradesh
Fishermen
Pakistan
Jagan
Mopidevi Venkataramana
YSRCP
  • Loading...

More Telugu News