Delhi: జేఎన్ యూలోకి చొరబడ్డ గుర్తుతెలియని వ్యక్తులు...ప్రొఫెసర్లు, విద్యార్థులపై దాడి

  • యూనివర్శిటీ విద్యార్థి నాయకుడు ఘోష్ కు గాయాలు
  • ముసుగులు ధరించి వర్శిటీ లోకి చొరబడ్డ దుండగులు
  • భారీగా మోహరించిన పోలీసులు 

ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్ యూ)లోకి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడ్డారు. ప్రొఫెసర్లు, విద్యార్థులపై రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. గాయపడ్డ వారిని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సుమారు యాభై మంది వ్యక్తులు ముసుగులు ధరించి వచ్చినట్టు సమాచారం.

యూనివర్శిటీలోని సబర్మతితో పాటు మరికొన్ని వసతి గృహాల్లోకి చొచ్చుకెళ్లి విద్యార్థులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో యూనివర్శిటీ విద్యార్థి సంఘం నాయకుడు ఐషే ఘోష్ కు తీవ్ర గాయాలయ్యాయి. మాస్కులు ధరించిన వ్యక్తులు తనను తీవ్రంగా గాయపరిచారని ఘోష్ తెలిపాడు. ఈ ఘటన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వర్శిటీ వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు.

Delhi
JNU
President
attack
police
  • Loading...

More Telugu News