Chandrababu: చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించిన జీఎన్ రావు

  • ప్రభుత్వ సలహాలతో మా నివేదిక రూపొందించామనడం అవాస్తవం
  • సంబంధిత అధికారులను, విభాగాధిపతులను సంప్రదించాం
  • శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టునూ పరిగణనలోకి తీసుకున్నాం

ఏపీ సమగ్ర అభివృద్ధికి తమ నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలను జీఎన్ రావు ఖండించారు. ప్రభుత్వ సలహాలతో ఈ నివేదిక తయారు చేశామనడం అవాస్తవమని, కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లను సంప్రదించామని, అన్ని విభాగాధిపతుల నుంచి సమాచారం తీసుకున్నామని చెప్పారు. గతంలో ఇచ్చిన శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టును కూడా పరిగణనలోకి తీసుకున్నామని, రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులపై నిపుణులతో చర్చించామని చెప్పారు.

రిపోర్టు తయారు చేసే క్రమంలో ప్రభుత్వ ముఖ్యులను కలవలేదని, వివిధ జిల్లాల ప్రజల ఆకాంక్షలను తెలుసుకున్నామని వివరించారు. సీఎం జగన్, అజయ్ కల్లాం సలహాలు తీసుకున్నామని అనడం సరికాదని, కొత్త నగరాలు, అంతర్జాతీయ నగరాలకు సంబంధించిన అర్బన్ ప్లానింగ్, డిజైనింగ్ నిపుణులు, కమిటీ సభ్యులను ఎవరూ ప్రభావితం చేయలేరని స్పష్టం చేశారు.

Chandrababu
Telugudesam
GN Rao Committee
  • Loading...

More Telugu News