JC Diwakar Reddy: బీజేపీ నేత సత్యకుమార్ ను కలవడంపై వివరణ ఇచ్చిన జేసీ

  • అనంతపురంలో సత్యకుమార్ తో జేసీ భేటీ
  • మిత్రుడు కావడంతోనే కలిశానని వెల్లడి
  • రాజకీయ ప్రాధాన్యంలేదని స్పష్టీకరణ

టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ను కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అనంతపురం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో సత్యకుమార్ ను జేసీ కలిసి మాట్లాడారు. దీనిపై జేసీ స్వయంగా వివరణ ఇచ్చారు. సత్యకుమార్ మిత్రుడు కావడంతోనే కలిశానని వెల్లడించారు. బీజేపీ నేతలతో సమావేశానికి పెద్దగా ప్రాధాన్యం లేదని అన్నారు. పార్టీ మారే ఆలోచన లేదని, ప్రాంతీయ పార్టీలు ఉన్నంతవరకు టీడీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. పీవోకేను భారత్ ఆక్రమిస్తే బీజేపీలో చేరతానని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.

JC Diwakar Reddy
Sathyakumar
Anantapur
Telugudesam
BJP
  • Loading...

More Telugu News