Pothireddy Padu: పోతిరెడ్డిపాడుకు నీటిని తీసుకెళతామని జగన్ అసెంబ్లీ సాక్షిగా చెప్పినా కేసీఆర్ ఎందుకు మాట్లాడడంలేదు?: నాగం

  • పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుపై రౌండ్ టేబుల్ సమావేశం
  • హాజరైన నాగం
  • జగన్ తో కేసీఆర్ కుమ్మక్కయ్యారంటూ ఆరోపణలు

తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి ధ్వజమెత్తారు. పోతిరెడ్డిపాడుకు నీటిని తీసుకెళతామని జగన్ అసెంబ్లీ సాక్షిగా చెప్పినా సీఎం కేసీఆర్ ఎందుకు మాట్లాడడంలేదని ప్రశ్నించారు. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఏపీ సీఎం జగన్ తో కేసీఆర్ కుమ్మక్కయ్యారనిపిస్తోందని ఆరోపించారు. ఏపీలో ఉన్న రాయలసీమను సస్యశ్యామలం చేస్తానని కేసీఆర్ చెప్పడాన్ని దీంట్లో భాగంగానే భావించాల్సి ఉంటుందని అన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్ధ్యం పెంపు ద్వారా తెలంగాణ నుంచి ఏపీ 1.2 లక్షల క్యూసెక్కుల నీటిని తీసుకెళ్లేందుకు సన్నద్ధమవుతోందని ఆరోపించారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంపు-తెలంగాణపై ప్రభావం అనే అంశంపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి నాగం జనార్దన్ రెడ్డి కూడా హాజరయ్యారు.

Pothireddy Padu
Andhra Pradesh
Telangana
Jagan
KCR
Nagam Janardhan Reddy
  • Loading...

More Telugu News