Chandrababu: చంద్రబాబును ఆపబోం..తీహార్ జైలు ఖాళీగానే ఉంది: స్పీకర్ తమ్మినేని సెటైర్లు

  • అవసరమైతే జైలుకు వెళ్తానని చంద్రబాబు అంటున్నారు
  • 3 రాజధానులు ఏర్పాటు చేయాలంటే దమ్ము ఉండాలి
  • విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధానికి బాబు అనుకూలమా? కాదా?

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం సెటైర్లు చేశారు. అవసరమైతే జైలుకు వెళ్తానంటున్న చంద్రబాబును ఆపబోమని, తీహార్ జైలు ఖాళీగానే ఉందని అన్నారు. ఈ సందర్భంగా రాజధానుల అంశం గురించి ప్రస్తావిస్తూ, మూడు రాజధానులు ఏర్పాటు చేయాలంటే దమ్ము ఉండాలని చెప్పారు. విశాఖపట్టణంలో ఎగ్జిక్యూటివ్ రాజధాని ఏర్పాటుకు టీడీపీ అధినేత చంద్రబాబు అనుకూలమా? కాదా? అని ప్రశ్నించారు. బోస్టన్ కమిటీ నివేదికను తప్పుబడుతున్న చంద్రబాబుకు అందరి మాటలు అబద్ధాలుగానే వినిపిస్తాయని విమర్శించారు.

Chandrababu
speaker
Tammineni
Amaravati
  • Loading...

More Telugu News